ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో స్థానిక ఎస్సై చంద్రశేఖర్ ఇటీవల బ్యాంకాక్ వెళ్లిన విషయం జిల్లాలో రచ్చకు కారణమైన సంగతి తెలిసిందే. అయితే ఎస్సై చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా వైసీపీ నేతలతో కలిసి ఫారిన్ టూర్‌కు వెళ్లడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేశారు.