ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిలను నియమించారు. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం సిఫార్సు చేసింది. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జీలుగా పదోన్నతి కల్పించారు. వెంకట రవీంద్రబాబు, రాధాకృష్ణ కృప సాగర్, శ్యామ్‌సుందర్, శ్రీనివాస్ ఊటుకురు, బోపన్న వరహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, మల్లికార్జునరావు, వెంకటరమణ పేర్లను జడ్జీలుగా కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సును త్వరలో రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు.
ఏపీ హైకోర్టులో ఫిబ్రవరి నెలలో ఏడుగురు న్యాయమూర్తులను నియమించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులుగా కె. శ్రీనివాసరెడ్డి, జి రామకృష్ణప్రసాద్, ఎన్ వెంకటేశ్వర్లు, టి రాజశేఖర్‌రావు, ఎస్ సుబ్బారెడ్డి, సి. రవి, వి. సుజాతలను నియమించారు. జనవరి 29న కొలిజీయం భేటీలో సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సిఫారసు చేశారు.