అనంతపురం జిల్లా పరిధిలోని కూడేరు పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS . పోలీసు స్టేషన్ నిర్వహణ,సిబ్బంది పని తీరు,విధులు,ముఖ్యమైన కేసుల దర్యాప్తు,స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ,విలేజ్ రోస్టర్ & వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను,వివిధ కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలను,రిసెప్షన్ కౌంటర్ ను,లాకప్ గదులను మరియు కంప్యూటర్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్లకు వచ్చే పిటీషనర్ల పట్ల మర్యాదగా, జవాబుదారీగా వ్యవహరించాలన్నారు.చట్టపరిధిలో సమస్యలను పరిష్కరాం చూపాలన్నారు.