గడిచిన మూడేళ్లలో భారత్‌లో ఏకంగా 36.29 లక్షల సైబర్ నేరాలు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా వెల్లడించారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం నివేదిక ప్రకారం.. 2019లో 3,94,499 సైబర్ కేసులు, 2020లో 11,58,208 కేసులు, 2021లో 14,02,809 కేసులు నమోదు కాగా, 2022లో ఇప్పటివరకు 6,74,021 సైబర్ కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు.