కేసుల దర్యాప్తులో నేర స్థలం నుండి ఆధారాలను సేకరించుటకు వినియోగించే అత్యాధునిక పరికరాల పట్ల అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ అధికారుల పర్యవేక్షణలో మూడు రోజుల పాటు విజయనగరం PTC లో నిర్వహించే శిక్షణ కార్యక్రమంకు Mrs. M. దీపికా, IPS, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అత్యున్నత ఫోరెన్సిక్ పరికరాల వినియోగం పట్ల ప్రతీ అధికారి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. నేర స్థలం నుండి సేకరించిన సైంటిఫిక్ ఆధారాలు కేసుల దర్యాప్తులో చాలా కీలకమని, సైంటిఫిక్ ఆధారాలతో నిందితులను ఖచ్చితంగా గుర్తించడంతో శిక్ష నుండి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో FSL జాయింట్ డైరెక్టర్ శ్రీమతి ఈశ్వరమ్మ, PTC ప్రిన్సిపాల్ శ్రీ ఎన్.ఆనందబాబు, FSL Disha Experts KN స్వామి, రీనా సుజన్, AD Dr. నాగరాజు, సైంటిస్ట్ గీతా మాధురి మరియు ఆరు జిల్లాలకు సంబంధిన పోలీసు అధికారులు పాల్గొన్నారు.