కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ ముందు హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వ్యవహారం కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు సోనియాకు సమన్లు జారీ చేశారు. దీంతో ఆమె ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్లనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీని ఈడీ అధికారులు 5 రోజుల పాటు విచారించారు.