ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్య ఎంతోమందిని వేధిస్తోంది. ఎలాగైనా బరువు తగ్గిపోవాలని చాలామంది డ్రింక్స్‌పై ఆధారపడుతున్నారు.ఈ లిక్విడ్స్ తాగితే చాలు.. బరువు తగ్గిపోతామని భ్రమ పడి ఏవోవో తాగేస్తున్నారు. కానీ ఇలాంటి డ్రింక్స్ నిజంగా బరువు తగ్గించగలవా? ఏవి తాగాలి? ఏవి తాగకూడదు?
'వెయిట్ లాస్'.. ప్రస్తుత రోజుల్లో ఇది ఎంతో మంది కల. బరువు తగ్గి.. స్లిమ్‌గా, ఫిట్‌గా అవ్వాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తిండి తినడం మానేసి కడుపు మాడ్చుకుంటారు. మరికొందరు జిమ్‌లో గంటల తరబడి గడుపుతూ తీవ్రంగా వ్యాయామాలు చేస్తుంటారు. కొంతమంది మాత్రం రకరకాల లిక్విడ్స్ తాగితే బరువు తగ్గుతామని తెలిసి ఏవోవో తాగేస్తుంటారు. అయితే అది మంచిది కాదంటున్నారు నిపుణులు. ఏ డ్రింక్స్ తాగాలో ఏవి తాగకూడదో తెలియజేశారు. అవేంటో తెలుసుకుందాం పదండి.
తాగకూడని పానీయాలు..
కూల్ డ్రింక్స్
స్మూతీస్
మిల్క్ షేక్స్
డైట్ కోక్స్
షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పానీయాలు
తాగాల్సిన లిక్విడ్స్..
పాలు
సోయా మిల్క్
కొబ్బరి పాలు
కోల్డ్ కాఫీ
గ్రీన్ టీ
తరచుగా మంచి నీరు తాగాలి
భోజనానికి ముందు నీరు తాగితే చాలా మంచిది
ఇంట్లో తయారు చేసుకున్న పండ్ల రసాలు
తమలపాకులు, మిరియాలు కలిపి వేసుకుని గ్లాస్ నీరు తాగాలి
ఇంట్లో చేసుకున్న వెజిటెబుల్ సూప్స్
పుదీనా రసంలో తేనె కలుపుకుని సేవించాలి