ప్రపంచ మార్కెట్ లో రూపాయి విలువ రోజురోజుకీ పతనమవ్వడానికి కారణం బీజేపీ ప్రభుత్వమేనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలో అన్నీ వ్యవస్థలనూ కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఆహారపు వస్తువులపై పన్నులు పెంచేస్తే పేదలు ఎలా బతకాలని దీదీ ప్రశ్నించారు. గురువారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆమె మాట్లాడారు.