దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 284.42 పాయింట్ల లాభంతో 55,681.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 84.50 పాయింట్ల లాభంతో 16,605.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 79.98 గా ఉంది. బజాబ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టెక్ మహీంద్రా, సిప్లా, కొటక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.