ఇటలీ ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. మారియో ద్రాగి తన పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇటలీ సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షను బహిష్కరించడం వల్ల గురువారం ద్రాగి తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటలీ అధ్యక్షుడు సెర్జియో మట్టరెల్లాకు రాజీనామా లేఖను అందజేయగా ఆపధర్మ ప్రధానిగా కొనసాగాలని ద్రాగిని అధ్యక్షుడు ఆదేశించారు.