పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, దేశంలో పలు రాష్ట్రాలకు మన పాలన ఆదర్శంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే లక్షా 65 వేల కోట్లు జమ చేశామని సీఎం వైయస్ జగన్ అన్నారు. అమ్మ ఒడి ఇచ్చిన రాష్ట్రం ఎక్కడా లేదు. ఆరోగ్యశ్రీలో 3 వేల చికిత్సలు ఇస్తున్న ప్రభుత్వం మనదే. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలి. లబ్ధిపొందుతున్న వారికి మరోసారి తెలియజెప్పాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు.