ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాల్లో సమస్యలు తీరే సమయం ఆసన్నమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 22, 2022, 12:54 PM

సీఎం జగన్ పార్టీ నాయకులతో సమావేశమై వారికీ  ప్ర‌తీ గ్రామ స‌చివాల‌యానికి ఇర‌వై ల‌క్ష‌ల రూపాయ‌లు మంజూరు చేస్తున్నామ‌ని, వీటిని వినియోగించుకుని సంబంధిత అభివృద్ధి ప‌నులు త‌క్ష‌ణ  అవ‌స‌రాలను దృష్టిలో ఉంచుకుని చేప‌ట్టాల‌ని చెప్పిన మాటలను  రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వెల్ల‌డించారు. మంత్రి ప్రసాదరావు నేతృత్వాన శ్రీకాకుళం మండలం, భైరి గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... "సరిగ్గా మూడేళ్ల కిందట ఎన్నికలు జరిగినప్పుడు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని మీ అందరికీ విన్నవించాను. మా పార్టీకి ఓటేస్తే ఏయే కార్యక్రమాలు అమలు చేస్తామో అన్నది కూడా మ్యానిఫెస్టో రూపంలో మీ అందరికీ వివరించాను. అలానే మీరు ఓటు వేశారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నన్ను కూడా గెలిపించారు. పాలన పగ్గాలు అందుకుని మూడేళ్లయింది. మూడేళ్ల కాలం అంటే ఓ ప్రభుత్వం పనిచేస్తున్న తీరును అర్థం చేసుకునేందుకు, అంచనా వేసేందుకు సరైన సమయం. ఓ ప్రభుత్వం అధికారంలో ఉండే ఐదేళ్ల కాలానికి గాను మూడేళ్ల కాలం పూర్తవ్వడం అంటే నిజంగానే ఇదొక కీలక సమయం. అందుకే మిమ్మల్ని కలిసేందుకు ఇక్కడికి వచ్చాను. మీకు ఆనాడు చెప్పిన మాటలు అన్నీ అమల్లోకి వచ్చాయా లేదా ఆచరణాయుతం అయ్యాయా అని తెలుసుకునేందుకే ఈ గడపగడపకూ మన  ప్రభుత్వం కార్యక్రమం. అందుకే మీకు అందుతున్న పథకాలు, వాటి తీరుతెన్నులు తెలుసుకున్నాకే నేను ఇచ్చిన మాటలు అన్నీ నిలబెట్టుకున్నాకే మళ్లీ మీ దగ్గరకు ఓటు అడిగేందుకు వస్తాను. ఏ విధంగా చూసుకున్నా మహిళల గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.. ఆ సంగతి మీరు మరిచిపోకూడదు. అదేవిధంగా గ్రామంలో విద్యుత్ సరఫరా కు సంబంధించి సమస్య ఉందని నా దృష్టికి తెచ్చారు. ఇందుకోసం కొత్త లైన్ మంజూరుకు ఎనిమిది లక్షల రూపాయలు తక్షణమే కేటాయించాలని  సంబంధిత అధికారులను ఆదేశించాను" అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com