రాజమండ్రి గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు నేడు డా.రవి రామ్ కిరణ్ గోరంట్ల వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రవి రామ్ కిరణ్ గోరంట్ల మాట్లాడుతూ మన శాసనసభ్యులు అమెరికా పర్యటనలో ఉన్న నిత్యం మీకోసమే ఆలోచిస్తారని ఎప్పటికప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ అకాల వర్షాల వల్ల ప్రజలుకు పనులు లేక తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలియజేసారు. ఈ సందర్భంగా రవి రామ్ కిరణ్ గోరంట్ల ఈ అకాల వర్షాలు వల్ల నష్టపోయిన దాదాపు 60 కి పైగా కుటుంబాలకు ఒక వారం సరిపడా నిత్యవసర సరుకులు బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa