ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్నాడు జిల్లా వ్యాప్తంగా పేకాట స్థావరాలపై కొనసాగుతున్న దాడులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 23, 2022, 01:03 PM

జిల్లాలో పోలీస్ వారు పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. దానిలో భాగంగా ... దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామరాజపురం గ్రామంలో పేకాట స్థావరంపై జరిపిన దాడులలో 11 మందిని అదుపులోకి తీసుకొని 14,370/- రూపాయలను సీజ్ చేశారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువాయపాలెం గ్రామంలో పేకాట స్థావరంపై జరిపిన దాడులలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని 1800/- రూపాయలను సీజ్ చేశారు. రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నవరప్పాడు గ్రామంలో పేకాట స్థావరంపై జరిగిన దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 6200/- రూపాయలను సీజ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa