బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునక్ వెనకబడ్డారు. నిన్నమొన్నటి వరకు ముందంజలో ఉన్న రిషికి తొలిసారి ఎదురుగాలి వీచింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు. ప్రముఖ యూగవ్ సర్వేలోనూ రిషికి కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు 38 శాతం మంది మాత్రమే వెల్లడైంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 12 విడతలుగా బ్రిటన్ ప్రధాని ఎన్నిక జరుగుతుంది.