వెస్టిండీస్ గడ్డపై శిఖర్ ధావన్ నేతృత్వంలోని వన్డే జట్టు దుమ్ము రేపుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన గబ్బర్ సేన మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక దేశంపై అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను గెలుచుకున్న జట్టుగా ఆ జట్టు చరిత్ర సృష్టించింది. బుధవారంతో వన్డే సిరీస్ ముగియనుండగా, శుక్రవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. విశ్రాంతి కారణంగా వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ ఉదయం రిషబ్ పంత్, దినేష్ కార్తీక్‌లతో కలిసి రోహిత్ వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత యూకేలో ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్లు సోమవారం వెస్టిండీస్ విమానం ఎక్కారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ స్టార్ ప్లేయర్లు వెస్టిండీస్‌లో చేరిన విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ ముగ్గురితో పాటు భారత్ నుంచి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ కూడా జట్టులోకి వచ్చారు.