అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా బగ్లాన్ ప్రావిన్స్‌లో అందరాబ్ జిల్లాలో ఒక యువకుడని వారు కాల్చి చంపారు. అనంతరం అతని మృతదేహాన్ని బహిరంగంగా వేలాడదీశారు. ఈ నెల 20న తాలిబన్లు కసా తరాష్ ప్రాంతంలోని అందరాబ్‌లో ఉంటున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లారు. ఇంట్లో నుంచి బయటకు రావాలని ఆదేశించారు. అతను బయటకు వచ్చిన వెంటనే కాల్చి చంపారు. ఈ హత్యకు గల కారణాలు మాత్రం తెలియలేదు.