స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోసపూరిత లావాదేవీల నుంచి కస్టమర్లకు రక్షణ కలిగించేందుకు వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) ఆధారిత నగదు విత్‌డ్రా సేవలను ప్రారంభించింది. ఈ సేవల ప్రకారం ఎస్‌బీఐ ఖాతాదారుడు రూ.10వేలకు మించి ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయాలంటే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూ.10వేల వరకు ఓటీపీ అవసరం లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.