శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు గతంలో నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యక్ష సచివాలయంలోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లి తమ నిరసన తెలిపారు. తాజాగా కట్టుదిట్టమైన భద్రత మధ్య సచివాలయం పునఃప్రారంభమైంది. 107 రోజుల తర్వాత కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె ఆదేశాల మేరకు ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. శ్రీలంకలో పరిస్థితులు మార్చేందుకు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.