టీమిండియా ఆటగాడు శుభ్మన్ గిల్ కు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ పలు సూచనలు చేశాడు. గిల్ కు మంచి నైపుణ్యం ఉందని, ఎక్కువ పరుగురు సాధించి జట్టులో కుదురుకోవాలని చెప్పాడు. గిల్ తరచూ సరైన షాట్ లు ఆడాలని, స్కూప్ షాట్లను మరింత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని సల్మాన్ అభిప్రాయపడ్డాడు. గిల్ వెస్టిండీస్ తో జరిగిన మొదటి వన్డేలో 64, రెండో వన్డేలో 43 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.