ఆగస్టు 13 నుంచి 15 వరకు 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా ఫ్లాగ్ కోడ్‌లో పలు మార్పులు చేసింది. అవి.. రాత్రిపూట కూడా జెండా ఎగురవేయవచ్చు. చేతితో, యంత్రంతో తయారు చేసిన జెండాలు రెండింటినీ ఎగురవేయవచ్చు. జెండాపై ఏదైనా రాయడం చట్టవిరుద్ధం. త్రివర్ణ పతాకం నేలను తాకకూడదు. ఏ ఇతర జెండా కంటే తక్కువ ఎత్తులో ఎగురవేయకూడదు. త్రివర్ణ పతాకాన్ని ఎలాంటి అలంకరణకు ఉపయోగించరాదు.