బీసీసీఐ బుధవారం కీలక ప్రకటన చేసింది. 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2013 తర్వాత 50 ఓవర్ల ప్రపంచ కప్ ను భారత్ లో నిర్వహించడం ఇదే తొలిసారి. భారత మహిళల జట్టు ఇప్పటివరకు మూడు సార్లు వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరుకుంది. కానీ కప్ గెలవలేకపోయింది. ఈసారైనా వరల్డ్ కప్ గెలవాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.