రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు నీళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా వరద ప్రాంతాలను సందర్శిస్తున్న సీఎం జగన్ బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రయాణం మొదలుపెట్టనున్నారు. పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్త్రృత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ఏఎస్ఆర్(అల్లూరి సీతారామరాజు జిల్లా) జిల్లా చింతూరులోని ఏపి టిడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల నుండి హెలీకాప్టర్ లో బయలుదేరతారు. 11 గంటల 30నిమిషాలకు వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు.
11 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 40 నిమిషాల వరకు కన్నాయిగుట్ట హెలీప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులను కలుసుకుని 11గంటల 45 నిమిషాలకు కన్నాయిగుట్ట హెలీప్యాడ్ నుండి రోడ్డుమార్గం ద్వారా కన్నాయిగుట్ట గ్రామానికి చేరుకుంటారు. 11గంటల 45 నిమిషాల నుండి 12గంటల 15 నిమిషాల వరకు వరద ముంపు ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తారు. అక్కడ నుండి బయలుదేరి 12గంటల 20 నిమిషాల వ్యూ పాయింట్‌ను చేరుకుంటారు. 12 గంటల 20 నిమిషాల నుంచి 12గంటల 50 నిమిషాల వరకు ఫొటో గ్యాలరీని సందర్శించి, కన్నాయిగుట్ట, తిరుమలాపురం, నార్లవరం గ్రామాల వరద బాధితులతో సి.యం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. 12గంటల 55 నిమిషాలకు బయలుదేరి రోడ్డుమార్గం ద్వారా కన్నాయిగుట్ట హెలీప్యాడ్‌ను చేరుకుంటారు. ఒంటి గంట 5నిమిషాలకు వేలేరుపాడు నుండి హెలీకాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.