భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా మరోసారి అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పర్వత ప్రాంతం నుంచి వరదలు దూసుకురావడంతో 4,000 మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గుహ చుట్టుపక్కల ప్రాంతంలో రిజర్వాయర్లు, సమీపంలోని వాగులు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. జూన్ 30న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 11న రక్షా బంధన్ నాడు ముగుస్తుంది.