భిక్షాటన చేసి ఓ బిచ్చగాడు రూ.55 లక్షలు దానం చేశాడు. తమిళనాడు తూత్తుకుడికి చెందిన పూల్ పాండియన్(72) 12 ఏళ్లుగా భిక్షామెత్తుకుని జీవిస్తున్నాడు. తాను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులను పది మందికి సాయం చేయాలనుకున్నాడు. ఇప్పటివరకు పాండియన్ రూ.55.60 లక్షలను పలు సందర్భాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేశాడు. సోమవారం వేలూరు కలెక్టరేట్‌కు వెళ్లి రూ.10వేలు అందజేసి, వాటిని శ్రీలంక తమిళులకు ఉపయోగించాలని కోరాడు.