ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. మూత్రాశయం మీద ఒత్తిడి తగ్గేందుకు తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాలి. మడమలు, కాళ్లకు శక్తినిచ్చే వ్యాయామాలు చేయాలి. పీచు పదార్థం ఎక్కువుండే ఆహారం తినాలి. ఎక్కువ నీళ్లు తాగాలి. నూనెలు ఎక్కువగా ఉండే పదార్థాలు తినొద్దు. పోషకాహారాన్ని తీసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడొద్దు.