గొంతు ఇన్ఫెక్షన్, గొంతు గరగరగా ఉంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కప్పు పాలలో చిటికెడు పసుపు చేర్చి తాగాలి. అందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమస్యను దూరం చేస్తాయి.వెల్లుల్లిని మెత్తగా చేసి అందులో ఉప్పు, కారం కలిపి వేడి అన్నంలో తీసుకోవాలి. అరకప్పు వేడి నీళ్లలో చెంచా శొంఠి పొడి, నిమ్మరసం, అల్లం రసం, తేనే కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే సరిపోతుంది.