న్యూడ్ ఫొటోలు చూపించి ఓ జంటను బెదిరిస్తున్న వ్యక్తిని ముంబైలోని ఖార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. 39 ఏళ్ల డాక్టర్, అతడి భార్య ఏకాంతంగా ఉన్న ఫొటోను అజీజ్ అనే వ్యక్తి సంపాదించాడు. గతంలో వారింట్లో పని చేసిన అతడిపై వారు దొంగతనం కేసు పెట్టారు. పగతో రగిలిపోయి ఆ ఫొటో చూపించి డబ్బు కావాలని వారిని బెదిరించసాగాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడిని అరెస్ట్ చేశారు.