వ్యవసాయ మోటార్లకు మీటర్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో రైతులకు చెప్పాలి. దీనిపై రైతులకు లేఖలు రాయండి. రైతుపై ఒక్కపైసా కూడా భారంపడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్నికూడా వారికి వివరించండి. శ్రీకాకుళంలో పైలట్ప్రాజెక్ట్ ఎలా విజయవంతం అయ్యిందో.. రైతులకు జరిగిన మేలును వివరించండి అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
విద్యుత్ శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, బొగ్గు సప్లయ్, పోలవరం విద్యుత్ ప్రాజెక్ట్ పనులపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై పూర్తిస్థాయి అధికారులతో చర్చించారు.