కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలులో శుక్రవారం వైఎస్సార్ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 'గతంలో అధికార పార్టీ చెప్పిన వారికే సంక్షేమ పథకాలు అందేవి. అప్పటికీ, ఇప్పటికీ జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా పథకాలు అందిస్తున్నాం. గత ప్రభుత్వం దోచుకో, పంచుకో, తినుకో పథకం అమలు చేశారు' అని అన్నారు.