వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన దినేశ్ కార్తీక్ కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. సూర్యకుమార్ 24, పంత్ 14, జడేజా 16 పరుగులు చేశారు.