వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. 44 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు (3,443 పరుగులు) చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా టీ20లలో 50కి పైగా పరుగులు 31 సార్లు నమోదు చేసిన రికార్డు సొంతం చేసుకున్నాడు.