national | Suryaa Desk | Published :
Sat, Jul 30, 2022, 08:06 AM
కర్ణాటక చామరాజనగర్ సమీపంలోని మలిమహాదేశ్వర్ కొండపై శుక్రవారం ఓ భక్తుడికి బంపరాఫర్ తగిలింది. లడ్డూ ప్రసాదం కోసం వెళ్లగా, ఆలయ ఉద్యోగి పొరపాటున ఓ బ్యాగు ఇచ్చేశాడు. అందులో దేవస్థానానికి సంబంధించిన డబ్బు రూ.2.91 లక్షలు ఉన్నాయి. తర్వాత తేరుకున్న ఆ ఉద్యోగి ఎంత వెతికినా డబ్బు దొరకలేదు. సీసీ టీవీ ఫుటేజీ వెతకగా, అందులో ప్రసాదానికి బదులు పొరపాటున డబ్బు ఉన్న బ్యాగును ఇచ్చినట్లు తేలింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com