దక్షిణాఫ్రికాలోని క్రుగర్స్‌డోర్ప్ అనే పట్టణంలో దారుణం జరిగింది. ఓ వీడియో షూటింగ్ కోసం వచ్చిన 8 మంది యువతులపై గురువారం దొంగలు అత్యాచారం చేశారు. అందులోని ఓ మహిళపై 10 మంది సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత అక్కడున్న పురుషుల దుస్తులను దొంగలు విప్పించారు. వారి వద్దనున్న డబ్బు, విలువైన వస్తువులతో పరారయ్యారు. 20 మంది అనుమానితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మంత్రి భేకీ సెలె శుక్రవారం తెలిపారు.