హిమాచల్‌ప్రదేశ్‌లో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్నది. సోలన్ జిల్లాలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదయింది. బద్ది ప్రాంతానికి చెదిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో బాధపడుతున్నాడని అధికారులు తెలిపారు. దీంతో అతన్ని ఐసోలేషన్‌లో పెట్టి, నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు. 21 రోజుల క్రితమే అతనికి ఇన్ఫెక్షన్ వచ్చిందని, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని చెప్పారు. అతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదన్నారు.