ఇటీవల ఏపీలో ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఏకంగా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు సైతం వేధింపులు ఎదురయ్యాయి. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆన్‌లైన్ లోన్‌యాప్‌ల నుంచి రుణాలు తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. రుణగ్రహీతలకు కాకుండా వేరే వాళ్లకు ఫోన్లు వస్తే, వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.