బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బిహార్‌లో చేదు అనుభవం ఎదురైంది. నడ్డా ఒకప్పుడు చదువుకున్న పాట్నా కళాశాలకు శనివారం వెళ్లగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆయన్ను చుట్టిముట్టి నిరసన తెలిపారు. జేపీ నడ్డా గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2020 జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, పాట్నా యూనివర్సిటీకి కేంద్ర హోదా కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.