రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లా ఘటోల్ ప్రాంతంలో ఓ మహిళను ఆమె భర్త, బంధువులు చెట్టుకు కట్టేసి కొట్టారు. భర్త కర్రతో కనికరం లేకుండా కొట్టడంతో ఆ మహిళ నొప్పితో కేకలు వేసింది. తన స్నేహితుడితో సన్నిహితంగా కనిపించడంతో భర్త ఈ దారుణానికి తెగబడ్డాడు. 4 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఎస్పీ రాజేష్ కుమార్ మీనా తాజాగా స్పందించారు. నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.