ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానసిక ఒత్తిడిని పోగొట్టుకోండిలా

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jul 31, 2022, 07:12 AM

ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన తర్వాతే ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. ఈ కష్టాలు అధిగమించే సమయంలో మనం వ్యవహరించే తీరే చాలా ముఖ్యం. సమస్యలు ఎదురైనప్పుడు మనం దైర్యంగా ఉండాలి. మనం కుంగుబాటుకు గురైతే ఏం సాధించలేం. మన దైర్యమే మన గెలుపుకు నాంది. ప్రతి చిన్న సమస్యను చూసి భయపడితే మనం జీవితంలో ముందుకు వెళ్లలేం. పరీక్షల్లో ఫెయిలయ్యామనో,ప్రేమలో విఫలమయ్యామనో,ఉద్యోగం రాలేదనో లేక ఇతరులతో పోల్చుకొని కుంగిపోవాల్సిన పని లేదు. ప్రతి మనిషిలో ఒక్కో నైపుణ్యత ఉంటుంది. . అలా అయితేనే మనం అనుకున్న రంగంలో రాణించగలం. దానిని గుర్తించి ముందుకు సాగాలి. కొంత మంది క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య అనేది పిరికిపంద చర్య అసలు మానసిక సమస్యను మన మనసులోకి రానివద్దు.
మానసిక ఒత్తిడి లక్షణాలు.
ఆందోళనగా కనిపించడం, ఒళ్ళంతా చెమట పట్టడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, నోరు పొడిబారినట్లు అవడం, గుండెదడ వంటి లక్షణాలతో పాటు మానసిక ఒత్తిడి, అధికంగా ఆందోళన చెందడం, ఏ పనిమీద సరిగా దృష్టి పెట్టలేకపోవడం, ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మానసిక ఒత్తిడికి పరిష్కార మార్గాలు :
- మానసిక ఒత్తిడికి గురైనపుడు మనకు లభించిన సమయాన్ని సరైన కార్యక్రమాలు ఎంచుకోవడంతో పాటు సానుకూల దృక్పథం గల ఆలోచనలు చేస్తూ సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనగా టి‌విలలో మానసిక ఉల్లాసం కలిగించేటువంటి కార్యక్రమాలు చూడడం.

- ఆహ్లాదానిచ్చే సినిమాలు చూడడం, ఇంట్లోనే ఉంటూ బంధువులు మరియు స్నేహితులతో మాట్లాడడం, పజిల్స్ సాధించడం, స్టోరీబుక్స్ చదవుతూ ఉండాలి. అంతేకాకుండా ఒత్తిడిని అధిగమించడానికి, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వ్యాయామం, యోగా చేయడమే కాకుండా మంచి నిద్రతో సరైన విశ్రాంతి తీసుకోవాలి

మనిషి ఉల్లాసంగా ఉండడానికి ఈ క్రింది హార్మోన్లు ఎంతగానో ఉపయోగడతాయి. ఈహార్మోన్లు మనందరి శరీరంలో ఉంటాయి. వాటిని ఉత్తేజపరచడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఉల్లాసవంతంగా ఉండవచ్చు.
మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ ఎండార్ఫిన్స్ మన శరీరంలో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి.
నవ్వడం వలన కూడా ఈ ఎండార్ఫిన్ ఎక్కువగా విడుదల అవుతాయి. ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ ఉండండి.

నిత్య జీవితంలో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో డోపామైన్ హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందంగా ఉంటాము. ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన వంట చేసిన వారిలో డోపామైన్ స్థాయిని మీరు పెంచగలరు. ఆఫీస్ లో బాస్ మీ పనిని మెచ్చుకుంటే మీలో డోపామైన్ స్థాయి పెరుగుతుంది.
- అలాగే కొత్త బైక్/కార్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు, కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీరు సంతోషంగా ఉండడానికి కారణం ఈ డోపామైన్ విడుదల కావడమే.
- ఇతరులకు సాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది.
- మన స్నేహితులకు ఏదైనా మంచి పని చేసినపుడు మనలో సెరిటోనిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది.
- ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు?

స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం, మొక్కలు నాటడం, రోడ్ల గుంతలు పూడ్చడం, రక్త దానం, అనాధ సేవ, యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాలు చేయడం. మంచి విషయాలు సోషల్ మీడియాలో, బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం. ఇలా మన సమయాన్ని, మన జ్ఞానాన్ని పంచుతున్నాం కాబట్టి మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది.
మరపురాని సంఘటనలను గుర్తుచేసుకున్నపుడు, అలాగే మీ పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది. మానసిక కుంగుబాటుకు గురైనప్పుడు ఇలా చేయాలి. మనిషి మానసికంగా కుంగుబాటుకు గురైనపుడు దాన్ని అధిగమించడంతోపాటు బలంగా ఉండేందుకు ప్రయత్నించాలి. వ్యాయామాలు చేయడం, ఇంట్లో వారికి పనుల్లో సాయం చేయడం, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడం, కుటుంబసభ్యులతో కలసి ఉండడం చేస్తూ ఉండాలి. మరీ ఎక్కువ ఒత్తిడికి గురైనపుడు గదిలో ఒంటరిగా ఉండకూడదు. అలాగే ఇలాంటి సందర్బాలు ఎదురైనపుడు సొంత వైద్యం చేసుకుని ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉన్న సరైన వైద్యున్ని సంప్రదించి తగిన సహాయం పొందాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com