ఏ వ్యాధి లేకున్నా కొందరికి విపరీతమైన ఆకలి ఉంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన పలు ఆహారాలను తీసుకుంటే దాంతో ఆకలిని నియంత్రించవచ్చు. బీన్స్, పచ్చి బఠానీలు, శనగలు, పప్పు ధాన్యాలు, ఆకు కూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే త్వరగా ఆకలి కాదు. గుడ్లు, మాంసాహారం, పెరుగు, సోయా ఉత్పత్తులను తీసుకున్నా ఆకలి కంట్రోల్‌లో ఉంటుంది.