పల్నాడు జిల్లా మాచర్ల మండలం, కొత్తపల్లిలో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని కొడుకు తలపై ఇనుప రాడ్డుతో కొట్టి తల్లిదండ్రులు హత్య చేశారు. ఆ మృతదేహాన్ని మూట కట్టి పొలంలో పూడ్చారు. శుక్రవారం రాత్రి ఘటన జరిగింది. అయితే శనివారం పొలంలో పనులు చేసే వారికి మృతదేహం మూట కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి పరిశీలించిన పోలీసులు తల్లితండ్రులను అదుపులోకి తీసుకున్నారు.