భారతదేశంపై ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతిని రుద్దడం అసాధ్యమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. దీనికి ప్రచారం చేసే వారు దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. శనివారం నిర్వహించిన ఓ వర్చువల్ మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫెడరలిజమే దేశానికి పునాది అని స్టాలిన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ అగ్రనేతలను ఉద్దేశించి చేసినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.