ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో హరిత అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎస్‌ఎల్‌వి ఫైనాన్షియల్ సర్వీస్ రికవరీ ఏజెంట్లు తన ఇంటికి వచ్చి వేధించడంతో హరిత ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఏడుగురు రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ అనంతరం ఆదివారం నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సాయి, పవన్ హరితతో అసభ్యకరంగా మాట్లాడినట్లు తేలింది.
![]() |
![]() |