తమిళనాడులో శనివారం సుమతి(19) అనే నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మాదిరవేడులోని మహిళా నర్సింగ్ కాలేజీలో ఆమె నర్సింగ్ సెకండియర్ చదువుతోంది. కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్ లో ఉంటోంది. శనివారం విద్యార్థులంతా లంచ్ కి వెళ్లగా, సుమతి తన రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.