దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్ఐఏ అనేక చోట్ల తనిఖీలు నిర్వహించింది. దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ చేస్తున్న కుట్రను భగ్నం చేసేందుక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) ఆదివారం ఆరు రాష్ట్రాల్లోని 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొంతమంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్, రైసన్ జిల్లాలు.. గుజరాత్‌లోని భరూచ్, సూరత్, నవ్‌సారి, అహ్మదాబాద్.. బిహార్‌లోని అరారియా, కర్ణాటకలోని భత్కల్, తుంకూర్.. మహారాష్ట్రలోని నాందేడ్, కొల్హాపుర్, ఉత్తరప్రదేశ్‌లోని దియోబంద్ జిల్లల్లో ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించి జూన్ 25న సుమోటోగా నమోదు చేసిన ఓ కేసుకు సంబంధించి ఈ దాడులు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు గుజరాత్‌లో మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా, ఫిబ్రవరిలో తమిళనాడులో అరెస్ట్ చేసిన కేసులో ఎన్‌ఐఏ ఆదివారం కేరళలోని త్రివేండ్రం జిల్లాలో కూడా సోదాలు నిర్వహించింది. ఫిబ్రవరి 21న స్కార్పియో కారును తనిఖీ చేస్తుండగా.. కొందరు వారిని అడ్డగించి పోలీసు సిబ్బందిని హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. వీళ్లంతా కూడా దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడంలో కీలక వ్యక్తులని చెప్పారు. ఖిలాఫత్ పార్టీ ఆఫ్ ఇండియా, ఖిలాఫత్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, మేధావి విద్యార్థులు వంటి సంస్థలను ఏర్పాటు చేసి దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. ఐసిస్, అల్ ఖైదాతో కూడా వీళ్లకి సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారని తెలిపింది.