కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియ సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైదని, తొలిరోజు 4 వేల మంది నమోదు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సోమవారం తెలిపారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలలో ప్రారంభించిన తొలిరోజే ఆధార్ అనుసంధానానికి పౌరుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఆధార్ అనుసంధానం ఇష్టమైతేనే నమోదు చేసుకోచ్చని తెలిపారు.