టీమిండియాతో సోమవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19.4 ఓవర్లలో 138 రన్స్ కి ఆలౌటైంది. టీమిండియాలో హార్దిక్ పాండ్య (31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్ మెక్కాయ్ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. కింగ్ 68, థామస్ 31* రన్స్ తో రాణించారు.