Education | Suryaa Desk | Published :
Tue, Aug 02, 2022, 07:30 AM
తెలంగాణ లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు పీజీఈసెట్ నిర్వహించనున్నారు. మొత్తం 19సబ్జెక్టుల కోసం రోజూ రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ సెట్ కోసం 14,933 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, సోమవారం నిర్వహించిన ఈ-సెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ-సెట్ కోసం మొత్తం 91% మంది హాజరయ్యారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa