తిరుపతి వెంకటేశ్వర స్వామికి కానుకల రూపంలో వచ్చిన ఆదాయం రికార్డుస్థాయిలో నమోదైంది. టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా జూలై నెలలో 139.45 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. దీంతో వరుసగా ఐదో నెల కూడా రూ . 100 కోట్లు దాటడం విశేషం. మార్చి నెలలో రూ. 128 కోట్లు, ఏప్రిల్ లో రూ. 127.5 కోట్లు, మే నెలలో రూ. 130.5 కోట్లు, జూన్ లో రూ. 123.76 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా జూలై నెలలో వచ్చింది.