ఈనెల 13 న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో అధిక కేసులు డిస్పోజల్ అయ్యేలా చూడాలని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ IPS ఆదేశించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ఎస్పీలు, . డీఎస్పీలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
లోక్ అదాలత్ లో కాంపౌండబుల్ కేసులు, క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, న్యూసెన్స్ కేసులు, గుట్కా, శ్యాండ్ కేసులు పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు కూడా ఈ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS , శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ IPS మరియు రెండు జిల్లాల డీఎస్పీలు ఆయా పోలీసు కార్యాలయాల నుండీ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa